Saturday, May 4, 2024

Zomato | ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంచిన జొమాటో..

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచింది. ఇక నుంచి ప్రతి ఆర్డర్‌పై 5 రూపాయల చొప్పున వసూలు చేయనుంది. ఏప్రిల్‌ 20 నుంచి పెంచిన ఫీజును జొమాటో అమల్లోకి తీసుకువచ్చింది. ఢిల్లి, హైదరాబాద్‌, బెంగళూర్‌, ముంబై, లక్నో వంటి నగరాల్లో పెంచిన ఫీజును ప్రయోగాత్మకంగా 20 నుంచి వసూలు చేస్తోంది. దీన్ని తాజాగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. స్విగ్గీ ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ ఫీజు 5 రూపాయలు వసూలు చేస్తోంది.

జొమాటో మొదటిసారి 2023 ఆగస్టులో ప్లాట్‌ఫాం ఫీజును ప్రవేశపెట్టింది. తొలుత ఆర్డర్‌కు 2 రూపాయలు వసూలు చేసింది. అక్టోబర్‌లో ఫీజును 3 రూపాయలకు, జనవరిలో 4 రూపాయలకు పెంచిందది. తాజాగా 5 రూపాయలు చేసింది. ఫుడ్‌ డెలివరీ సంస్థలు ఫుడ్‌తో పాటు డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆదాయం పెంచుకునేందుకు కొత్తగా ప్లాట్‌ఫామ్‌ ఛార్జీలు ప్రవేశపెట్టాయి.

ఫుడ్‌ డెలివరీ సంస్థలు తమ యాప్‌, వెబ్‌సైట్‌ను ఉపయోగించి సేవలు పొందే కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్న ఫీజునే ప్లాట్‌ఫాం ఫీజు అంటారు. ఇంటర్‌సిటీ లెజెండ్స్‌ పేరుతో ఒక నగరంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆహార పదార్ధాలను ఇతర నగరాల్లోనూ సరఫరా చేసే సేవలను జొమాటో నిలిపివేసింది. ఈ సర్వీస్‌కు పెద్దగా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సేవల విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు కూడా వచ్చాయి. వీటిని నిలిపివేయడానికి ఇది కూడా ఒక కారణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement