Thursday, May 2, 2024

డెలివరీ బాయ్‌ అవతారమెత్తిన జొమాటో సీఈవో

జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్‌ గోయల్‌ తానే స్వయంగా బైక్‌పై బయల్దేరి ఆర్డర్లు డెలివరీ చేశారు. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా గోయల్‌ కొత్త అవతారమెత్తారు. డెలివరీ భాగస్వాములు, రెస్టారెంట్‌ భాగస్వాములు, కస్టమర్లకు ఫ్రెండ్‌షిప్‌ డే బ్యాండ్లు, ఫుడ్‌ను పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను దీపిందర్‌ గోయల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. సాధారణ డెలివరీ బాయ్‌ వేసుకునే రెడ్‌ టీ షర్ట్‌ ధరించి, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పైన కస్టమర్లకు ఫుడ్‌ డెలివరీలు చేయడం విశేషం. ఆయన చేతిలో ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌ కూడా ఉన్నాయి. డెలివరీ బాయ్‌గా అవతారమెత్తిన జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సంస్థ సీఈవో ఇలా చేయడం పట్ల చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement