Sunday, April 28, 2024

స్విగ్గీ బాటలోనే జొమాటో..

ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ బాటలోనే జొమాటో కూడా ప్లాట్‌ఫాం ఫీజు వసూలు చేయనుంది. ఇది ప్రతి ఆర్డర్‌పైన రూ.2గా ఉంటుందని జొమాటో వెల్లడించింది. స్విగ్గీ ఈ ఏప్రిల్‌లోనే ప్లాట్‌ఫాం రుసుం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే తొలిసారిగా లాభాలు ఆర్జించింది. గతంలో ప్రతిసారీ నష్టాలు నమోదు కాదా… ఈసారి రూ.2 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ లాభాలు మున్ముందు కొనసాగాలంటే… ఇలాంటి చర్యలు తప్పట్లేదని జొమాటో సంస్థ వెల్లడించింది. వీటితోనే జొమాటో నడవగలదని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement