Monday, May 6, 2024

యూఎస్ వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.. రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు జారీ

ఉన్నత విద్యకోసం, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనేది ఎంతో మంది కల, కోరిక. అమెరికాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో ఇండియా ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. కాగా, అమెరికీ వెల్లాలనుకునే వారందరికీ అగ్రరాజ్యం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఇండియాకు చెందిన వారికి రికార్డుస్థాయిలో వీసాలను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. 10 లక్షలకుపైగా వీసాలను జారీ చేయనున్నట్టు తెలిపింది.

ఈ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేనాటికి భారతీయ విద్యార్థులందరికీ స్టూడెంట్ వీసాలను ఆమోదించనున్నట్లు తెలిపింది. H-1B వీసా, వలసేతర వీసా, యూఎస్ కంపెనీలు ప్రత్యేక వృత్తుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement