Saturday, May 4, 2024

25న ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనం – కుటుంబ సమేతంగా తరలిరావాలని పువ్వాడ ఇన్విటేషన్

ఖమ్మం నగరం : ఖమ్మం నగరంలోని మమతా కళాశాల గ్రౌండ్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఈనెల 25న ఉదయం 9 గంటలకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం జరుగనుంది. పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడం, క్యాడర్‌తో క్రియాశీలకంగా పనిచేయించడం, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి అజయ్‌ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. పార్టీ జిల్లా నేతల నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు వారిలో సుహృత్‌ భావాన్ని నెలకొల్పేలా పువ్వాడ అధ్వర్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనం జరుగనుంది. దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలనే లక్ష్యాన్ని పెట్టుకున్న కేసిఆర్ అన్నట్లుగానే బీఆర్‌ఎస్‌ను ప్రకటించారు.

పార్టీ మొదటి బహిరంగ సభ ఖమ్మంలోనే జరగడం విశేషం. దాంతో ఖమ్మం పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. -కార్యకర్తలకు భరోసా కల్పించేందుకే.. : మంత్రి అజయ్ పార్టీ పటిష్టం కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి రాజకీయంగా వారికి భరోసానివ్వడానికే బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయడంతోపాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ ప్రచారం చేసేలా దిశానిర్దేశం చేయనున్నాం. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాలు, మనోభావాలను పంచుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనాలను పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాం. 25న ఉదయం 9 గంటలకు జరిగే ఖమ్మం సభకు ప్రతి బీఆర్ఎస్ సభ్యుడు కుటుంబ సమేతంగా తరలిరావాలనీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement