Monday, April 29, 2024

వీకెండ్ క్లాష్ ! PS2పై క్రియేట్ కాని హైప్.. ఏజెంట్ కి అడ్వాంటేజ్ కానుందా…

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “ఏజెంట్”.. మణిరత్నం ఎపిక్ డ్రామా “PS-2” ఈ వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద క్లాష్ కానున్నాయి. మణిరత్నం “పొన్నియన్ సెల్వన్-1” ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తప్ప ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించింది. కాగా, ఏజెంట్ సినిమా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసినప్పుడు, PS 2 సినిమాకి పోటీగా వస్తుందని కొద్దిగా బయ పడ్డారు మూవీ మేకర్స్. “PS 2” సినిమాకి పాన్ ఇండియన్ లెవల్ లో మంచి బజ్ ఉందని భావించారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో PS 2 చుట్టూ ఎటువంటి సందడి కనిపించడంలేదు. అంతే కాకుండ, కర్ణాటక అండ్ ఉత్తర భారతదేశంలో కూడా “PS 2” కి అంతగా హైప్ కనిపించడం లేదు. దీంతో, కంటెంట్ బాగుంటే, “ఏజెంట్” సినిమా సక్సెస్ కావడానికి మంచి అవకాశం ఉంది. అంతే కాకుండ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో “ఏజెంట్” సినిమాకి చాలా మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా సాయిధరమ్ తేజ్ “విరూపాక్ష”తో పోటీ పడవలసి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement