Sunday, May 5, 2024

భారత ప్రయాణికులపై బ్యాన్ విధించిన యూఏఈ..

గ‌ల్ప్ దేశ‌మైన యూఏఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటం..థార్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో యూఏఈ అప్రమత్తమయింది. భార‌త్‌తో స‌హా 14 దేశాల‌కు చెందిన ప్ర‌యాణికుల‌పై నిషేదం విధించింది.  ఈ నిషేధం జులై 21 వ‌ర‌కు అమ‌లులో ఉండ‌బోతున్న‌ది.  భార‌త్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంకతో పాటుగా ఆఫ్రికాలోని వివిధ దేశాల‌పై కూడా యూఏఈ నిషేదం విధించింది.  క‌రోనా మ‌హ‌మ్మారి దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు యుఏఈ సివిల్ ఏవియోష‌న్ అధారిటి తెలియ‌జేసింది.  అయితే, కార్గో, చార్టెడ్ విమానాల‌కు ఈ నిషేదం వ‌ర్తించ‌ద‌ని తెలియ‌జేసింది. యూఏఈ ఎక్కువగా పర్యటకులు వస్తుంటారు కాబట్టి..కరోనా తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కేది వీరికే..!

Advertisement

తాజా వార్తలు

Advertisement