Thursday, May 16, 2024

మా దేశానికి ఇండియా సెకండ్ గ్రేడ్ టీమ్‌ పంపిస్తారా?: రణతుంగ

తమ దేశానికి సెకండ్ గ్రేడ్ ఇండియ‌న్ టీమ్‌ను పంపించ‌డంపై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున ర‌ణ‌తుంగ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఇది త‌మ క్రికెట్‌ను అవమానించ‌డం కంటే ఏమాత్రం త‌క్కువ కాద‌న్నాడు. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని సీనియ‌ర్ టీమ్ ఇంగ్లండ్ టూర్‌లో ఉండ‌గా.. శిఖ‌ర్ ధావ‌న్ స్టాండింగ్ కెప్టెన్‌గా మ‌రో టీమ్ శ్రీలంక వెళ్లింది. ఇది సెకండ్ రేట్ ఇండియ‌న్ టీమ్‌ అని.. వాళ్లు రావ‌డం అనేది మ‌న క్రికెట్‌ను అవ‌మానించ‌డ‌మే అవుతుందని రణతుంగ అభిప్రాయపడ్డాడు.

అస‌లు ఈ ప్రతిపాదనకు అంగీక‌రించిన శ్రీలంక క్రికెట్ బోర్డును అనాలని.. కేవ‌లం టీవీ మార్కెటింగ్ అవ‌స‌రాల కోస‌మే దీనికి ఓకే చెప్పారని ర‌ణ‌తుంగ మండిప‌డ్డాడు. మరోవైపు ఈ మ‌ధ్యే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన శ్రీలంక‌.. వ‌రుస‌గా ఐదు టీ20 సిరీస్‌ల‌లో ఓట‌మి చ‌విచూసింది. ఆట‌గాళ్ల‌లో క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోవ‌డం కూడా దీనికి కార‌ణ‌మ‌వుతోంద‌ని రణతుంగ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను బోర్డులో ఉన్న‌ప్పుడు ఇలాంటి వాటిని అస్స‌లు అనుమ‌తించ‌లేద‌ని అన్నాడు. లంక బోర్డును పూర్తిగా ప్ర‌క్షాళ‌ణ చేయాల‌ని డిమాండ్ చేశాడు.

ఇది కూడా చదవండి: ముగిసిన క్వారంటైన్.. స్విమ్మింగ్ ఫూల్‌లో టీమిండియా ఆటగాళ్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement