Sunday, May 5, 2024

TCS | వేతన పెంపుపై టీసీఎస్‌ నిబంధనలు..

వేతన పెంపు, ప్రమోషన్లకు సంబంధించి తమ ఉద్యోగులకు ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) నిబందనలు పెట్టింది. రిటర్న్‌టూ ఆఫీస్‌ నిబంధనలకు అనుగుణంగా జీతాల పెంపు, ప్రోత్సాహకాల ఉంటాయని తెలిపింది. దీనికి సంబంధించి తమ బృందాలకు తెలియ చేయాలని అన్ని శాఖల విభాగాధిపతులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

కార్యాలయం నుంచి పని చేస్తున్న వారి ట్రాక్‌ రికార్డు, పనితీరులో ఉద్యోగులకు ఇచ్చే గ్రేడ్లు ఆధారంగా ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు అమలు చేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే కంపెనీలో చేరిన ఫ్రెషర్స్‌, వారికి కేటాయించిన కోర్సులను విజయవంతంగా పూర్తి చేస్తేనే, వార్షిక వేతనం 3 లక్షల కంటే ఎక్కువ జీతాలకు అర్హులని తెలిపింది. గతేడాది అక్టోబర్‌ మొదటి వారంలోనే వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానానికి టీసీఎస్‌ ముగింపు పలికింది.

ఉద్యోగులంతా కార్యాలయాలకు రావడం ఎంత అవసరమో కంపెనీ 2022-23 వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగులు కంపెనీ వాతావరణంలో పని చేయడం చాలా ముఖ్యమని పేర్కొంది. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని పేర్కొంది. కొత్త ఉద్యోగులు, సీనియర్లు, టీమ్‌ లీడర్ల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని, ఉద్యోగులు పరస్పరం చర్చించుకోకుండా అభివృద్ధి సాధ్యంకాదని టీసీఎస్‌ సీఈఓ క్రితివాసన్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement