Friday, May 3, 2024

ఆరు నెలల్లో 16 శాతం పెరిగిన ఈవీ టూ వీలర్స్‌ అమ్మకాలు

ప్రభుత్వం ఫేమ్‌-2 సబ్సిడీలో కోత విధించిన తరువాత భారీగా అమ్మకాలు పడిపోయిన విద్యుత్‌ టూ వీలర్ల అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వీటి అమ్మకాలు 16 శాతం పెరిగి 3.4 లక్షల యూనిట్లగా నమోదయ్యాయి.

జూన్‌ 1 నుంచి ఫేమ్‌-2 సబ్సిడీలో కోత విధిస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నెలలో అమ్మకాలు భారీగా తగ్గాయి. కొనుగోలు దారులు నెమ్మదిగా తగ్గిన సబ్సిడీల విషయంలో సంకోచించకుండా కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. జూన్‌లో 3.2 శాతం అమ్మకాలు తగ్గి 45,806 యూనిట్లకు పడిపోయాయి. ఆగస్టు, సెప్టెంబర్‌ నాటికి వీటి అమ్మకాలు 62 వేలకు పెరిగాయి.

అలా నెలనెలకు వీటి అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. జులైలో 18.5 శాతం, ఆగస్టులో 15 శాతం అమ్మకాలు పెరిగాయి. సెప్టెంబర్‌లో మాత్రం 1.5 శాతం అమ్మకాలు తగ్గాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో అన్ని రకాల టూ వీలర్ల అమ్మకాలు 51 శాతం పెరిగి 7.4 లక్షల యూనట్లుగా నమోదయ్యాయ.

ఇందులో 3.4 లక్షల యూనిట్లు విద్యుత్‌ టూ వీలర్లు ఉన్నాయి. అదే సమయంలో మిద్యుత్‌ త్రీ వీలర్‌ వాహనాల అమ్మకాలు ఈ ఆరు నెలల కాలంలో 163 శాతం పెరిగి 42,323 యూనిట్లుగా నమోదయ్యాయి. గ త సంవత్సరం ఇదే కాలంలో 16,095 యూనిట్లు అమ్మకాలు జరిగాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement