Wednesday, May 15, 2024

రుణాలపై వడ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ

ప్రభుత్వ దిగ్గజబ్యాంక్‌ ఎస్‌బీఐ రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును 70 బేసిస్‌పాయింట్ల హెచ్చిస్తున్నట్లు తెలిపింది. దీంతో ప్రస్తుతం 12.75 శాతంగా ఉన్న వడ్డీరేటు ఇకపై 13.45 శాతానికి చేరుతుంది. సవరించిన వడ్డీరేట్లు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అదేవిధంగా బేస్‌రేట్‌ సైత్‌ 8.7 శాతానికి పెంచింది. వడ్డీరేట్లను ఎస్‌బీఐ చివరిసారిగా జూన్‌లో పెంచింది. సెప్టెంబర్‌ 28నుంచి 30 తేదీల్లో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి కమిటీ భేటీ కానుంది. దీనికి ముందే ఎస్‌బీఐ వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఎఫ్‌డీలపై పీఎన్‌బీ వడ్డీరేట్ల పెంపు

నిర్దిష్టకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను స్వల్పంగా పెంచింది. సీనియర్‌ సిటిజన్ల , సూపర్‌ సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై వడ్డీరేట్లను 30బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. సీనియర్‌ సిటిజన్లకు 5-10 ఏళ్ల కాలానికి 6.15శాతం నుంచి 6.45 శాతానికి పెంచింది. ఇదే కాల వ్యవధికి సాధారణ పౌరుల వడ్డీరేటు 5.65శాతానికి పెంచింది. సూపర్‌సీనియర్‌ సిటిజన్‌లకు 4-5 రోజుల ఎఫ్‌డీకి 6.9శాతం గరిష్ట వడ్డీరేటు లభిస్తుంది. కొత్త వడ్డీరేట్లు ఈనెల 13నుంచే అమల్లోకి వచ్చాయని పీఎన్‌పీ వెబ్‌సైట్‌ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement