Sunday, May 5, 2024

వన్‌ప్లస్‌ 10ఆర్‌ ప్రైమ్‌ బ్లూ

ఆకర్షణీయమైన ఫీచర్లతో వన్‌ప్లస్‌ ఇండియా మార్కెట్లోకి వచ్చింది. వన్‌ప్లస్‌ 10ఆర్‌ ప్రైమ్‌ బ్లూ పేరుతో కొత్త వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అమెజాన్‌పై మాత్రమే ఈ ఫోన్‌ లభించనుందని తెలిపింది. వన్‌ప్లస్‌, అమెజాన్‌ల సుధీర్ఘబంధం సెలబ్రేషన్‌లో భాగంగా ఈ ఫోన్‌ని విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. వన్‌ప్లస్‌ 10ఆర్‌ ప్రైమ్‌ బ్లూ ఫోన్‌ కొనుగోలు చేసేవారికి 3 నెలలపాటు ఉచితంగా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రప్షన్‌ లభించనుంది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ సమయంలోగా విడుదల చేసే అవకాశాలున్నాయి. ప్రైమ్‌ బ్లూ కలర్‌లో మాత్రమే వన్‌ప్లస్‌ 10ఆర్‌ లభ్యమయ్యే సూచలున్నాయి.

5000 ఎంఏహెచ్‌ సామర్థ్యమున్న బ్యాటరీ, 80వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో అందించనుంది. ధర విషయానికి వస్తే.. 8జీబీ ర్యామ్‌, 128 స్టోరేజీ ఫోన్‌ రూ.34,999కు లభించనుంది. 12జీబీ ర్యామ్‌, 256 స్టోరేజీ ఫోన్‌ ధర రూ.38,999గా ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ట్రిపుల్‌ రీయర్‌ కెమెరా(బ్యాక్‌) సెటప్‌ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్‌ సోనీ ఐఎంఎక్స్‌766 సెన్సార్‌ ప్రధానమైనది కాగా 8 మెగా పిక్సెల్‌ అల్ట్రా–వైడ్‌ కెమెరా, 2మెగాపిక్సెల్‌ మాక్రో షూటర్‌ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement