Sunday, May 5, 2024

ఆర్‌ అండ్‌ డీపై ఓలా 4వేల కోట్ల పెట్టుబడి..

ఓలా ఎలక్ట్రికల్‌ కంపెనీ సెల్‌ పరిశోధనా, అభివృద్ధిపై 4 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. బెంగళూర్‌లో ప్రపంచ స్థాయి బ్యాటరీ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (బీఐసీ)ని ఏర్పాటు చేస్తున్నట్లు ఓలా కంపెనీ సీఈవో భావేష్‌ అగర్వాల్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఈ సెంటర్‌లో అత్యాధునిక పరిశోధనా, అభివృద్ధి సౌకర్యాలు ఉంటాయని వెల్లడించారు. ఇందు కోసం 500 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు తెలిపారు. ఈ పరిశోధనా కేంద్రంలో 500 మంది ఇంజనీర్లు, పీహెచ్‌డీ చేసిన వారు పని చేస్తున్నారని పేర్కొన్నారు. బీఐసిలో ప్రపంచ స్థాయి పరిశోధనా సాధనాలు ఉన్నాయని, సెల్‌ పరిధోనలో 165 అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నట్లు ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్‌ వాహనాల్లో ఉపయోగించే సెల్స్‌కు సంబంధించి డిజైన్‌, ఫ్యాబ్రికేషన్‌, టెస్టింగ్‌ ఇలా అన్ని సదుపాయలు ఒకే చోట ఉంటాయని తెలిపారు.

బ్యాటరీ మెటీరియల్స్‌, ఇతర విడి భాగాలను ఇందులో తయారు చేస్తారు. ఓలా ఇటీవలనే సొంతగా తయారు చేసిన లియాన్‌ ఎన్‌ఎంసీ 2170 పేరుతో సెల్‌ను విడుదల చేసింది. కంపెనీ వచ్చే సంవత్సరం నుంచి భారీ ఎత్తున ఈ సెల్స్‌ను ఉత్పత్తి చేయనుంది. కంపెనీ 50 గిగావాట్స్‌ సామర్ధ్యం ఉన్న సెల్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాంట్‌ ఓలా తయారు చేస్తున్న స్కూటర్స్‌కు, త్వరలో రానున్న కార్లకు సెల్స్‌ తయారు చేసేందుకు సరిపోతుందని కంపెనీ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement