Sunday, April 28, 2024

Follow up : భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నాడు రోజంతా లాభాల్లోనే ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1100 పాయింట్లకు పైగా లాభపడింది. ఇన్ఫోసిస్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్లలో జోష్‌ను పెంచాయి. ముడి చమురు ధరలు తగ్గడం కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. సెన్సెక్స్‌ 30లో 20 షేర్లు లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు గురువారం నాడు అనూహ్యంగా పుంజుకున్నాయి. దీనితో ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. రెండో త్రైమాసికంలో ఐటీ దిగ్గజ కంపెనీలు ఆశజనకమైన ఫలితాలు ప్రకటించడంతో ఐటీ షేర్లు రాణించడం కూడా కలిసి వచ్చింది. సెన్సెక్స్‌ 684.64 పాయింట్లు లాభపడి 57919.97 వద్ద ముగిసింది. నిఫ్టీ 171.35 పాయింట్లు లాభపడి 17185.70 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 442 రూపాయలు తగ్గి 50442 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 1164 రూపాయలు తగ్గి 55976 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.25 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు :

ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, నెస్లే ఇండియా, టైటాన్‌ కంపెనీ, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు :

- Advertisement -

ఎంఅండ్‌ ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతి సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, టాటా మోటర్‌, అదానీ ఎంటర్‌ప్రైజ్‌, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement