Friday, May 3, 2024

ఎల్‌ఐసీ ఐపీఓ 4 నుంచి ప్రారంభం.. 9వ తేదీతో ముగింపు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఐపీఓగా వచ్చేందుకు ముహుర్తం ఖరారైనట్టు తెలుస్తున్నది. మే 4వ తేదీన ఐపీఓ ప్రారంభం అవుతుందని, 9వ తేదీతో ముగుస్తుందని ఎల్‌ఐసీ ఐపీఓతో సంబంధం ఉన్న ఓ అధికారి వెల్లడించారు. అయితే షేర్‌ విలువ రూ.902 నుంచి రూ.949 మధ్య ఉంటుందని వివరించారు. పాలసీ హోల్డర్లకు రూ.60 డిస్కౌంట్‌ లభించనుంది. ముంబై వేదికగా.. నేడు (బుధవారం) ఎల్‌ఐసీ ఐపీఓకు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ప్రైబ్‌ బ్యాండ్‌, సబ్‌ స్క్రిప్షన్‌ తేదీలు, ప్రారంభం, ముగింపు, అలాట్‌మెంట్‌, రీఫండ్‌, స్టాక్స్‌ క్రెడిట్‌, ఐపీఓ లిస్టింగ్‌ తేదీలను వివరంగా ప్రకటించనుంది. 221.3 మిలియన్‌ షేర్ల ఎల్‌ఐసీ ఐపీఓ సైజ్‌ను ప్రభుతం ఏర్పాటు చేసింది. 3.5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించేందుకు నిర్ణయించింది.

దీనిపై కూడా నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత వాటా విక్రయానికి సెబీ ఆమోద ముద్ర కూడా వేసింది. దీంతో యాంకర్‌ ఇన్వెస్టర్స్‌కు 2న షేర్లను జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తొలుత ప్రభుత్వం 5 శాతం వాటాను ఆఫర్‌ చేయాలని భావించింది. చివరికి 3.5 శాతానికి పరిమితం చేసుకుంది. 3.5 శాతానికి సమానమైన 22 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా.. రూ.21,000 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ప్రభుత్వం ఎల్‌ఐసీకి రూ.6లక్షల కోట్ల విలువ ఆశిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement