Monday, September 16, 2024

పరాగ్‌ అగర్వాల్‌ పరిస్థితి ఏంటి.. ట్విట్టర్‌ను అమ్మేశాం

టిట్టర్‌ పిట్టను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ చేజిక్కించుకున్నాడు. బిలియనీర్‌ ఎలాన్‌ చేతికి సోషల్‌ మీడియా దిగ్గజం టిట్టర్‌ వెళ్లిపోవడంపై ఆ సంస్థ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ స్పందించారు. టిట్టర్‌ భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదని ఆయన సంస్థ ఉద్యోగులతో చెప్పుకొచ్చాడు. సంస్థ కొనుగోలు ఒప్పందం ముగిసే వరకు తానే సీఈఓగా ఉంటానని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించే ఉద్దేశంలేదని తేల్చి చెప్పాడు. కొత్త ఉద్యోగుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఎలాన్‌ మస్క్‌ టిట్టర్‌ పూర్తి స్థాయి యజమాని అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని వివరించాడు. ప్రస్తుతం సంస్థ వద్ద అన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవని చెప్పుకొచ్చారు. టిట్టర్‌ డీల్‌ పూర్తయి.. ఎలాన్‌ మస్క్‌ పూర్తి స్థాయిలో యాజమానిగా మారాలంటే.. కనీసం 3 నుంచి ఆరు నెలల సమయం పడుతుందని పరాగ్‌ చెప్పుకొచ్చారు. ఒక వేళ సీఈఓగా ఉన్న పరాగ్‌ అగరాల్‌ను తొలగించాలంటే.. ఆయనకు 42 మిలియన్‌ డాలర్ల (రూ.321 కోట్లు) పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పరిశోధనా సంస్థ ఈక్విలార్‌ తెలిపింది. ప్రక్రియ ముగిసిన తరువాత ట్విట్టర్‌ ప్రైవేటు కంపెనీగా మారి బోర్డు రద్దు అవుతుందని బోర్డులోని సభ్యుడు ఒకరు తెలిపాడు.

2021లోనే సీఈఓగా పరాగ్‌..

టిట్టర్‌ సీఈఓగా పరాగ్‌ అగరాల్‌ 2021 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. భారత సంతతికి చెందిన 37 ఏళ్ల పరాగ్‌ అగర్వాల్‌.. ఇప్పుడు 6 నెలలు కూడా పూర్తి కాకుండానే సంస్థ ఎలాన్‌ మస్క్‌ చేతిలోకి వెళ్తోంది. దీంతో పరాగ్‌ భవిష్యత్తుపై కూడా అనిశ్చితి నెలకొంది. ఆయనను సీఈఓగా కొనసాగించేందుకు మస్క్‌ ఆసక్తి చూపుతారో.. లేదో.. మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. టిట్టర్‌ను మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశాడు. ఎప్పట్నుంచో టిట్టర్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నించిన ఎలాన్‌ మస్క్‌.. చివరికి విజయం సాధించాడు. ఇప్పుడు ఎలాన్‌ మస్క్‌ చేతిలో టిట్టర్‌ పాలసీలు మారుతాయా..? ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. టిట్టర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ తీసుకురావాలని ఎలాన్‌ మస్క్‌ కోరుకుంటున్నాడు. దీనిపై ఎలాన్‌ మస్క్‌ పోల్‌ చేపట్టగా.. పరాగ్‌ అగర్వాల్‌ స్పందిస్తూ.. ఆలోచించి మీట నొక్కాలని హెచ్చరించారు. బ్లూమ్‌ బర్‌ ్గ నివేదిక ప్రకారం.. టిట్టర్‌ ఉద్యోగుల్లో 90 శాతం మంది మస్క్‌కు వ్యతిరేకంగా ఉంటే.. 10 శాతం మంది మాత్రమే డీల్‌పై సుముఖంగా ఉన్నట్టు తెలుస్తున్నది. రష్యా నాయకుడు జోసెఫ్‌ స్టాలిన్‌తో ఎలాన్‌ మస్క్‌ను పోల్చాడు పరాగ్‌ అగరాల్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement