Thursday, November 7, 2024

Nani | బాక్సాఫీస్ దగ్గర నాని మరో సెంచరీ !

వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో నేచురల్ స్టార్ నాని-ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రంలో తమిళ డైరెక్టర్, నటుడు ఎస్‌జే సూర్య కీలకపాత్రలో నటించారు. ఇక జేక్స్ బిజోయ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఆగస్ట 29న రిలీజ్ అయిన ఈ చిత్రం 20 రోజుల్లోపే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. ప్రస్తుతం సరిపోదా శనివారం హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

కాగా, బాక్సాఫీస్ దగ్గర నాని రూ.100 కోట్లు కొల్లగొట్టడం ఇది రెండోసారి కావడం విశేషం. మొదటిసారి ‘దసరా’ చిత్రంతో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరారు నాని. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న కూడా మంచి వసూళ్లు సాధించి సత్తా చాటింద. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ సినిమా కూడా రూ.100 కోట్లకుపైగా వసూళ్లు (గ్రాస్‌) సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement