Tuesday, May 14, 2024

Jio New Year 2024 Offer | 389 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ 5జీ డేటా 

టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024’ పేరుతో.. ప్రీపెయిడ్ యూజర్ల కోసం న్యూ ఇయర్ ఆఫర్ ను ప్రకటించింది. సంవత్సరం వ్యాలిడిటీతో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ కు అదనంగా 24 రోజులు వ్యాలిడిటీ అందిస్తోంది. అంటే ప్రస్తమున్న 365 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,999 తో రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 24 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్లో ఉండే అన్ని పయోజనాలు అదనపు వ్యాలిడిటీ సమయంలోనూ ఉంటాయి.

ఈ ఆఫర్ కు సంబంధించిన వివరాలను జియో తమ‌ అధికారిక వెబ్ సైట్, యాప్ లో పొందుపరిచింది. లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,999 తో రీఛార్జ్ చేసుకుంటే 365 కు బదులు 389 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అన్ని ప్రయోజనాలు సేమ్ ఉంటాయి. ఈ ఆఫర్ ను జియో వెబ్ సైట్, లేదా మై జియో యాప్ లో కొనుగోలు చేయవచ్చు. జియో స్టోర్ కు వెళ్లినా రీఛార్జ్ చేస్తారు.

24 రోజులు అదనపు వ్యాలిటీడీ ఉండటంతో ఈ ఆఫర్ ద్వారా యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది. రూ. 2,999 ప్లాన్ తో సగటున రోజుకు రూ. 8.21 ఖర్చు అవుతుండగా, అదనపు వ్యాలిడిటోతో రోజుకు రూ. 7.70 మాత్రమే అవుతుంది. రూ. 2,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ తో యూజర్లు రోజుకు 2.5 జీబీ 4జీ డేటా పొందుతారు. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచితంగా పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ లో జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ మాత్రం లభించదు. దీని కోసం ప్రత్యేకంగా సబ్ స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జియో సినిమా ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ సంవత్సరానికి రూ. 1,499 గా ఉంది. 14 ఓటీటీ యాప్స్ ఉచితంగా లభిస్తాయి. జియో సినిమా పోర్టల్ లో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement