Sunday, May 19, 2024

పెరిగిన సన్‌ఫ్లవర్‌ ఆయిల్ దిగుమతులు.. వంట నూనె ధ‌ర‌లు దిగొచ్చేనా?

మన దేశం ఆగస్టులో 1.35 లక్షల టన్నుల సన్‌ప్లవర్‌ నూనెను దిగు మతి చేసుకుంది. ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత రష్యా, అర్జెంటినా నుంచి ప్రధా నంగా ఈ దిగుమతులు జరుగుతున్నాయి. జులైతో పోల్చితే ఆగస్టులో దిగుమతు లు 89.6 శాతం పెరిగాయి. మన దేశం అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకుంటోంది. మొత్తం దిగుమతుల్లో 16 శాతం సన్‌ ప్లవర్‌ ఆయిల్‌ ఉంటోంది. సంక్షోభానికి ముందు ఉక్రెయిన్‌ నుంచే 70 శాతం సన్‌ ప్లవర్‌ నూనెను మన దేశం దిగుమతి చేసుకునేది. 20 శాతం రష్యా నుంచి వచ్చేది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం తో ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి దిగుమతులకు ఇబ్బందులు వచ్చాయి.

ప్రస్తుతం రష్యా, అర్జెంటినా నుంచి అత్యధికంగా సన్‌ప్లవర్‌ నూనె దిగుమతి అవుతోంది. జులైలో 71,340 టన్నుల సన్‌ప్లవర్‌ నూనె దిగుమతి చేసుకున్నాం. ఆగస్టులో ఇది 89.6 శాతం పెరిగి 1,35,000 టన్నులకు చేరుకుంది. రష్యా నుంచి 72,780 టన్నుల నూనె దిగుమతి అయ్యింది. సంవత్సరం క్రితం ఇదే నెలలో 28, 840 టన్నులు మాత్రమే. అర్జెంటినా నుంచి 30,600 టన్నుల దిగుమతి అయ్యింది. గత సంవత్సరం ఇదే కాలంలో 12,500 టన్నులు మాత్రమే. టర్కి నుంచి 14,588 టన్నుల సన్‌ప్లవర్‌ నూనె దిగుమతి చేసుకున్నాం.

ఆగస్టులో పామ్‌ ఆయిల్‌ దిగుమతులు 32.64 శాతం పెరిగి 9,94,997 టన్ను లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో 7,50,134 టన్నులు మాత్రమే. పామోలిన్‌ ఆయిల్‌ దిగుమతులు కూడా పెరిగాయి. ప్రధానంగా ఆర్‌బీడీ పామో లిన్‌ దిగుమతులు పెరిగాయి. మొత్తం వంటనూనెల వినియోగంలో పామోలిన్‌ వాటా 12 శాతంగా ఉంది. మన దేశానికి పామోలిన్‌ నూనె ప్రధానంగా ఇండోనేషి యా, మలేషియా నుంచి , సోయాబిన్‌ ఆయిల్‌ అర్జెంటినా నుంచి వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement