Tuesday, May 14, 2024

మార్కెట్‌లో హోండా డియో 125 స్కూటర్‌

హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ న్యూ డియో 125 స్కూటర్‌ను గురువారం నాడు లాంచ్‌ చేసింది. ఈ కొత్త డియో ప్రారంభ ధర 83,400 రూపాయలుగా కంపెనీ తెలిపింది. రెండు వేరియంట్లలో ఇది కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. పాత డియో 110 సీసీ సెగ్మెంట్‌లో ఉంది. కొత్త డియో స్టాండర్ట్‌ వెరియంట్‌ ధర 83,400 రూపాయలు, స్మార్ట్‌ వేరియంట్‌ ధర రూ 91,300 గా ఉంది. యాక్టివా 125, గ్రాజియా తరువాత 125 సీసీ విభాగంలో వచ్చిన మూడో స్కూటర్‌ ఇది. కొత్త డియో 10 సంవత్సరాల వారంటీతో లభిస్తుంది.


కొత్త డియోలో ఐడ్లింగ్‌ స్టాపింగ్‌ సిస్టమ్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌, సీట్‌, ప్యూయల్‌ లిడ్‌ ఆన్‌లాక్‌ చేయడానికి మల్టిd ఫంక్షన్‌ స్విచ్తో పాటు 171 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో ఇది లభిస్తుంది. ముందు డిస్క్‌ బ్రేక్‌, అల్లాయ్‌ వీల్స్‌ ఇస్తున్నారు. స్మార్ట్‌ కీతో వస్తుంది.
దీంతో ఫిజికల్‌ కీ అవసరం లేదు. దీని ద్వారా కొంత దూరం నుంచే స్కూటర్‌ను లాక్‌, ఆన్‌లాక్‌ చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement