Monday, April 29, 2024

27, 28, 29 తేదీల్లో స్వగృహ ప్లాట్ల లాటరీ.. తేదీలను ప్రకటించిన హెచ్‌ఎండీఏ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ పరిధిలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్‌ స్వగృహ ఆపార్టుమెంట్ల ప్లాట్ల లాటరీ తేదీలను హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ఈనెల 27, 28, 29 తేదీల్లో లాటరీ తీయనున్నట్లు శనివారం ఒక ప్రక టనలో వెల్లడించింది. ఈనెల 27 పోచారం, 28. బండ్లగూడ (ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌, డీలక్స్‌ మినహా), 29న బండ్లగూడ ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌, డీలక్స్‌ ప్లాట్లు తీయనున్నారు. మొత్తం 3,716 ప్లాట్లకు 39,082 అప్లికేషన్లు అందినట్లు తెలిపింది.

ఇందులో ఒక బండ్లగూడకే 33,161 అప్లికేషన్లు వచ్చాయి. ప్లాట్ల లాటరీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, లాటరీని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. బండ్లగూడలో 340 ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ డీలక్స్‌ ప్లాట్లకు 16,679 దరఖాస్తులు వచ్చినందున ఈ లాటరీని ఈనెల 29న తీస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement