Tuesday, April 30, 2024

టైగ‌ర్ 3లో కీ రోల్ చేస్తున్నా – షారుక్ ఖాన్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు.కాగా బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తోన్న చిత్రం టైగ‌ర్ 3 . 2023 జ‌న‌వ‌రి 25న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది టైగ‌ర్ 3. ఏక్తా టైగ‌ర్‌, టైగ‌ర్ జిందా హై త‌ర్వాత స‌ల్మాన్, క‌త్రినా కాంబోలో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి.మ‌నీశ్ శ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో స‌ల్లూభాయ్‌కు జోడీగా మ‌రోసారి క‌త్రినాకైఫ్ న‌టిస్తోంది. హ్యాండ్‌స‌మ్ యాక్ట‌ర్ ఇమ్రాన్ హ‌ష్మీ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

య‌శ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న టైగ‌ర్ 3లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కీ రోల్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని షారుక్ ఖాన్ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఫుల్‌గా 30 ఏండ్ల ప్ర‌యాణాన్ని పూర్తి చేసిన సంద‌ర్భంగా అధికారికంగా ప్ర‌క‌టించి..అభిమానుల్లో జోష్ నింపాడు. అంతేకాదు మ‌రో అప్ డేట్ కూడా ఇచ్చి ఫుల్ ఖుషీ చేశాడు. షారుక్ త‌న అభిమానులు, ఫాలోవ‌ర్ల‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో క్వ‌శ్చ‌న్ & ఆన్స‌ర్ సెష‌న్స్ లో పాల్గొన్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ టైగ‌ర్ 3లో కీ రోల్ చేస్తున్నాడని చెప్పాడు. సిద్దాంత్ ఆనంద్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్న ప‌ఠాన్ షూటింగ్ పూర్తి అయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన‌సాగుతున్నాయన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement