Friday, April 26, 2024

జులై 8న రానున్న ”హ్యాపీ బర్త్‌ డే”..

సరికొత్త పాత్రలు, విభిన్న కథా నేపథ్యంతో ఆసక్తి రేకెత్తిస్తున్న మూవీ ”హ్యాపీ బర్త్‌ డే”. లావణ్య త్రిపాఠీ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాని ”మత్తువదలరా” ఫేమ్‌, దర్శకుడు రితేష్‌ రానా రూపొందిస్తుండ‌గా.. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.

అయితే.. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మార్చారు మేక‌ర్స్. హ్యాపీ బర్త్‌డే సినిమా జూలై 8న విడుదల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందిస్తుండ‌గా.. నరేష్‌ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషోర్‌, గుండు సుదర్శన్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement