Saturday, April 27, 2024

Fuel: అస్సలు తగ్గట్లేదుగా.. మళ్లీ పెరిగిన ‘పెట్రో’ ధరలు..

Petrol Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మ‌ళ్లీ పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్‌ సిలిండర్ రేట్ పెర‌గ‌డంతో ఇబ్బందులు పడుతున్న జనాలకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెనుభారంగా మారుతున్నాయి. ధరలను తగ్గించాలని వాహనదారుల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా.. రేట్లు పెంచ‌డం మాత్రం ఆప‌డం లేదు.

వరుసగా నాలుగో రోజూ శనివారం లీటరు పెట్రోల్‌, డిజిల్‌పై 37 పైసల చొప్పున వడ్డించాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.111.55కి చేరగా, డీజిల్‌పై 38 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.104.70కు పెరిగింది. నాలుగు రోజుల వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.1కిపైగా పెరిగాయి. ఈ 25 రోజుల్లో 20 సార్లు ధ‌ర‌లు పెరిగాయి. ఈ 20 రోజుల్లో లీటరుకు రూ.5పైనే సామాన్యుడిపై భారం పడింది. ఇక డీజిల్‌ విషయానికి వస్తే.. గత నెల 24 నుంచి ఈ నెల 23 వరకు దాదాపు 23 సార్లు ధరలు ఎగబాకింది. అంటే 29 రోజుల్లో 23 సార్లు పెరిగినట్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement