Monday, May 6, 2024

smart tech: అప్‌డేట్స్ చేయ‌ట్లేదా.. అయితే మీ ఫోన్ రిస్క్‌లో ఉన్న‌ట్టే..

SmartPhone Update: స్మార్ట్‌ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడం లేదా.. వాటికి సంబంధించిన మెస్సేజ్ లను ఇగ్నోర్ చేస్తున్నారా? అయితే మీరు ఇబ్బందుల్లో ప‌డ‌టం ఖామ‌యంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్స్‌. ఎందుకంటే.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఉండ‌డం వ‌ల్ల ఫోన్ హీటెక్క‌డం కానీ, బ‌గ్స్ వంటివి క్లియ‌ర్ అవుతాయి. కానీ, అప్‌డేట్ చేయడానికి చాలా టైమ్‌ పడుతుందన్న కార‌ణంగా.. అదేవిధంగా అప్‌డేట్ చేయడానికి చాలా డేటా అవసరం అవుతుందని సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడం పొరపాటు.

అప్‌డేట్‌లో, కంపెనీలు ప్రయోజనకరమైన అనేక విషయాలను ఇస్తాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం

కొత్త ఫీచర్లను పొందొచ్చు. కొన్ని సంవత్సరాలుగా WhatsApp అనేక కొత్త కొత్త అప్‌డేట్స్‌ను ఇస్తోంది. ప్రతిసారీ కంపెనీ కొన్ని కొత్త ఫీచర్లను అందిస్తోంది. అప్‌డేట్‌లో భాగంగా ఇవి మ‌న‌కు అందివ‌స్తాయి. అప్లికేషన్లు..ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కంపెనీలు కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. కొన్ని బ‌గ్స్ ఫిక్స్ కావ‌డంతో స్పీడ్ కూడా పెరుగుతుంది. అప్‌డేట్స్‌తో యాప్‌లు ఇంత‌కుముందు కంటే ఈజీగా వ‌ర్క్ అవుతాయి. లాగింగ్ ఇష్యూ ఉండ‌దు.

Advertisement

తాజా వార్తలు

Advertisement