Friday, April 26, 2024

అప్‌స్టాక్స్ లో సేవలు విస్తృతం.. ముగ్గురు కీలక విభాగాలకు నియామకాలు

అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫాం అప్‌స్టాక్స్‌ బుధవారం కీలక ప్రకటన చేసింది. తమ సంస్థను బలోపేతం చేయడంతో పాటు సేవలను విస్తృతం చేసేందుకుగాను పలువురిని కంపెనీలోకి ఆహానించినట్టు తెలిపింది. అప్‌స్టాక్స్‌ చీఫ్‌ హ్యుమన్‌ రీసోర్స్‌ ఆఫీసర్‌గా సుదీప్‌ రల్హాన్‌ను, కాంప్లియెన్స్‌ హెడ్‌గా మనోజ్‌ అగరాల్‌ను, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీరామ్‌ క్రిష్ణన్‌ను నియమిస్తున్నట్టు అప్‌స్టాక్స్‌ సహ వ్యవస్థాపకుడు శ్రీని విశ్వనాథ్‌ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీని విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. సుదీప్‌, మనోజ్‌ అగర్వాల్‌, శ్రీరామ్‌ క్రిష్ణన్‌ను తమ సంస్థలో స్థానం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. కంపెనీ పని తీరు మరింత మెరుగుపడేందుకు నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. అప్‌స్టాక్‌ మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు వారంతా కలిసి కృషి చేస్తున్నారనే నమ్మకం ఉందన్నారు. కంపెనీ హ్యుమన్‌ సోర్సెస్‌ విభాగంలోని పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్తానని ఆ విభాగం చీఫ్‌ సుదీప్‌ రల్హాన్‌ తెలిపారు. విస్తరణ, ప్రతిభ సముపార్జన, వనరు కేటాయింపు కోసం స్కోప్‌ నడిపిస్తుందన్నారు. మెరుగైన పనితీరే తన ముందున్న లక్ష్యం అన్నారు. అన్ని చట్టపరమైన విషయాలను కంపెనీ, నియంత్రణ అధికారుల మధ్య అనుసంధానంతో పాటు వ్యాపార ప్రొటోకాల్‌ కట్టుబడి ఉండటాన్ని పర్యవేక్షిస్తానని ఆ విభాగం హెడ్‌ మనోజ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. సమాచార భద్రత పోర్‌ ్టపోలియో నాయకత్వం వహిస్తున్నా అని, వ్యూహాత్మక దీర్ఘ కాలిక సమాచార భద్రతా రోడ్‌ మ్యాప్‌ను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి కృషి చేస్తానని ఆ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీరామ్‌ క్రిష్ణన్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement