Sunday, May 19, 2024

ఎలన్‌ బోర్డులో చేరట్లేదు, సలహాలు, సూచనలు తీసుకుంటాం.. టిట్టర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్

ఎలక్ట్రానిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా దిగ్గజ సీఈఓ ఎలన్‌ మస్క్‌ విషయంలో టిట్టర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. టిట్టర్‌ బోర్డులో మస్క్‌ చేరడం లేదని అగర్వాల్ టీట్‌ చేశారు. బోర్డులో సభ్యుడిగా ఉండటం.. ఎలన్‌ మస్క్‌కు ఆసక్తి లేదన్న పరాగ్‌ అగర్వాల్.. ఆయన సలహాలు, సూచనలు మాత్రం బోర్డు పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎలన్‌ను బోర్డులో చేర్చుకోవడం విషయమై.. ఆయనతోనే భేటీ అయినట్టు వివరించారు. ఈ సమావేశంలోనే బోర్డులో చేరేందుకు ఇష్టం లేదన్న విషయాన్ని ఎలన్‌ మస్క్‌ ప్రకటించారన్నారు. కంపెనీ వాటాదారులందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. బోర్డులో సభ్యుడిగా అవకాశం ఇచ్చినట్టు అగర్వాల్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలోనే.. ఏప్రిల్‌ 9వ తేదీనే.. ఎలన్‌ మస్క్‌ బోర్డు సభ్యుడిగా నియామకం విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. బోర్డు సభ్యుడిగా చేరడం తనకు ఇష్టం లేదన్న విషయాన్ని ఎలన్‌ మస్క్‌ అదే రోజు చెప్పినట్టు వివరించారు. టిట్టర్‌లో 9 శాతం అత్యధిక వాటాను మస్క్‌ కలిగి ఉన్నాడు. భవిష్యత్తులో కంపెనీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా.. ఎలన్‌ మస్క్‌ను సంప్రదిస్తామని పరాగ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement