Tuesday, April 30, 2024

వార్షిక గ్లోబల్‌ డస్ట్‌ అధ్యయన ఫలితాలను ప్రకటించిన డైసన్‌

ప్రభన్యూస్ : వార్షిక గ్లోబల్‌ డస్ట్‌ అధ్యయన ఫలితాలను డైసన్‌ ప్రకటించింది. ఇది పరిశుభ్రతకు సంబంధించిన అలవాట్లు, ప్రవర్తనలను వివరిస్తుండగా, ఇళ్లలోని ధూళితో ఎదురయ్యే సమస్యలు, మన ఆరోగ్యంపై అది చూపించే ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈసందర్భంగా డైసన్‌లో మైక్రోబయాలజీలో రీసెర్చ్‌ సైంటిస్ట్‌ మోనికా స్టుజెన్‌ మాట్లాడుతూ.. ప్రజలకు గచ్చుపై కనిపించే దుమ్ము కనిపించిన వెంటనే శుభ్రం చేసుకోవాలని అనుకుంటారు. కానీ, చాలా దుమ్ము కణాలు చాలా సూక్ష్మ పరిమాణంలో ఉంటాయన్నారు. వాస్తవానికి ప్రజలకు ఇంటి గచ్చుపై దుమ్ము కనిపిస్తే, దానితో పాటే మీ ఇంట్లో దుమ్ము పురుగులు ఉండే అవకాశముందన్నారు.

ధూళి, అలర్జీల గురించి పి.డి.హిందూజా ఆసుపత్రి అండ్‌ ఎంఆర్‌సిలో కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌ డా.లాన్సెలాట్‌ పింటో మాట్లాడుతూ.. ఈ ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారకం చిన్న ధూళి కణాలే అన్నారు. మనం శ్వాసించేందుకు గాలి పీల్చినప్పుడు, దానితో పాటే సన్నని ధూళి, దుమ్ము పురుగులు, చర్మపు పొలుసులు, ఇతర కాలుష్య కారకాలు (ఇళ్లలోని దుమ్ములో ఉంటాయి) మన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి, వాటి పనితీరుపై ప్రభావం చూపిస్తాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement