Tuesday, April 16, 2024

దసరా బ‌రిలో నిఖిల్ “స్పై”.. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాణం..

అనుకోకుండానే నిఖిల్ కి సినిమాల‌తో చాలా గ్యాప్ వచ్చేసింది. అర్జున్ సురవరం తరువాత నిఖిల్ నుంచి మరో సినిమా రాలేదు. దాంతో ఇక వరుస సినిమాలను థియేటర్లలో దింపే దిశగా ఆయన ముందుకు వెళుతున్నాడు యంగ్ హీరో. ఆయన తాజా చిత్రాలుగా ’18 పేజెస్’ .. ‘ కార్తికేయ 2’ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలు విడుదలకు రెడీ అవుతుండ‌గానే స్పై అనే సినిమాను సెట్స్ పైకి తీసుకెల్లాడు నిఖిల్.. నిఖిల్ కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం..

గ్యారీ బీహెచ్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాని ఈడీ ఎంటర్టైన్ మెంట్ సంస్థ వారు నిర్మిస్తున్నారు. చకచకా ఈ సినిమా షూటింగును జరుపుకుంటోంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ విటేకర్ పనిచేస్తుండటం విశేషం. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచ‌న‌లో ఉన్నారు ఈ మూవీ మేక‌ర్స్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement