Monday, May 6, 2024

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 10.54 లక్షల కోట్లు.. నవంబర్‌ 10 నాటికి 30.69 శాతం పెరుగుదల

దేశంలో నవంబర్‌ 10 నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 10.54 లక్షల కోట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 30.69 శాతం పెరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పేర్కొన్న ప్రత్యక్ష పన్నుల వాటాలో ఇది 61.31
శాతంగా ఉన్నాయి. కార్పోరేట్‌ ఆదాయ పన్ను ఇందులో 22.03 శాతంగా ఉన్నాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను 40.64 శాతం ఉన్నాయి. రిఫండ్స్‌ పోగా కార్పోరేట్‌ పన్నులు నికరగా 24.51 శాతంగా ఉన్నాయని ప్రభుత్వం శుక్రవారం నాడు విడుదల చేసిన వివరాల్లో పేర్కొంది. వసూలైన పన్నుల్లో రిఫండ్స్‌ 1.83 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి నవంబర్‌ 10 వరకు ఇచ్చిన రిఫండ్స్‌ మొత్తం. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే రిఫండ్స్‌ 61.07 శాతం పెరిగాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement