Monday, May 13, 2024

BSNL | డిసెంబర్‌ నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ.. వచ్చే జూన్‌ కల్లా దేశమంతా సర్వీస్‌లు

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ త్వరలోనే 4జీ సేవలను ప్రారంభించనుంది. ఈ సంవత్సరం డిసెంబర్‌ నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ పీకే పూర్వార్‌ తెలిపారు. మొదట పంజాబ్‌ నుంచి 4జీ సేవలు ప్రారంభమవుతాయని ఆయన ప్రకటించారు. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో ఈ విషయం తెలిపారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలకు సంబంధించి ఇప్పటికే 200 ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. తొలిదశలో పంజాబ్‌లోని కొన్ని చోట్ల ఈ సేవలు ప్రారంభించి, క్రమంగా దశలవారీగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. 2024 జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని 4జీ కోసం ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

జీ విస్తరణ పూర్తయ్యాక 5జీ సర్వీసులను ప్రారంభిస్తామని చెప్పారు. 4జీ నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్‌ చేసే బాధ్యతను ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌, ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐకి అప్పగించినట్ల తెలిపారు. 5జీ సేవలు ప్రారంభించేందుకు కావాల్సిన స్పెక్ట్రమ్‌ అందుబాటులో ఉందన్నారు. ప్రైవేట్‌ సంస్థలకు 4జీ తరువాత 5జీ సేవలను దేశమంతా విస్తరిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ, ఇప్పుడు 5జీ స్పెక్ట్రమ్‌ ఇవ్వకుండా జాప్యం చేసింది.

తో ప్రైవేట్‌ సంస్థలు మార్కెట్‌ను పూర్తిగా వినియోగించుకున్ను తరువాత ప్రభుత్వం 5జీ బదులుగా 4జీని కేటాయించింది. తాజాగా ప్రైవేట్‌ టెలికం సంస్థలు 5జీ సేవలను దేశమంతా విస్తరిస్తున్నాయి. మొత్తం మార్కెట్‌ వీరి ఆధీనంలోకి వెళ్లిన తరువాతే బీఎస్‌ఎన్‌ఎల్‌కు 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయించే అవకాశం ఉంది. దీని వల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌కు వినియోగదారులు పెద్దగా పెరిగే అవకాశంలేదు. ప్రభుత్వ రంగ సంస్థ పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ, కార్మిక సంఘాలు చాలా కాలంగా విమర్శిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement