Saturday, May 18, 2024

Vikram 62 | విక్ర‌మ్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. వీడియో అదిరిపోయింది

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తంగాల‌న్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది (2024) జ‌న‌వ‌రి 26న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. కాగా, తాజాగా విక్ర‌మ్ త‌న అప్ క‌మింగ్ మూవీని అనౌన్స్ చేశాడు. తన 62వ సినిమాను ప్రకటించాడు. ఎస్‌యూ అరుణ్ కుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ తెర‌కెక్కనుంది.

దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా విడుదల చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటుల గురించి త్వ‌ర‌లోనే అప్‌డేట్ ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement