Saturday, May 4, 2024

Election – ఎపి – తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరోతెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా ఆదేశాలతో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన జగ్గయ్యపేట, నందిగామ డివిజన్ పరిధిలో అణువణువునా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో 11 ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

శనివారం 22 ప్రాంతాల్లో కార్డన్ నిర్వహించిన పోలీసులు 147 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 12 వాహనాలను సీజ్ చేసి 143 కేసులను నమోదు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా 45 లీటర్ల మద్యంతో పాటు 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనుమాన హాస్పిటల్ కేసుల్లో ఉన్న 315 మందిపై బైండోవర్ కేసులను నమోదు చేశారు. పాటు 255 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసులను నమోదు చేశారు.

ఎన్నికల నేపథ్యంలో 123 వెపన్స్ ను డిపాజిట్ గా వెనక్కి చేసుకున్న పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. 24 గంటల పాటు సరిహద్దుల్లో రాకపోకలు సాగించే వాహనాలతో పాటు మనుషుల వివరాలను తెలుసుకుంటూ పగడ్బందీగా చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement