Sunday, April 28, 2024

NO WORK-NO PAY | ఉదయం తొమ్మిది లోపే పాఠశాలకు రావాలి.. ఉపాధ్యాయుల హాజరుపై అధికారుల సీరియస్‌

అమరావతి, ఆంధ్రప్రభ : దసరా సెలవుల అనంతరం సిఎస్‌ఈ ఉపాధ్యాయుల బయోమెట్రిక్‌ హాజరు పై ప్రతేక శ్రద్ధ పెట్టింది. ఖచ్చితంగా ఉదయం 9 గంటల లోపే లాగ్‌ ఇన్‌ అవ్వాలని, సాయంత్రం 3.30/4.00 తర్వాతే లాగ్‌ అవుట్‌ అవ్వాలని ఐటి సెల్‌ విభాగం ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. గతంలో ఉన్న 10 నిముషాల గ్రేస్‌ పిరియడ్‌ సౌతం ఎత్తివేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా హాజరు వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులకు గుంటూరు ఎంఈవొ నోటీసులు జారీ చేయడం, సాయంత్రం లాగ్‌ అవుట్‌ వేయలేదని విజయనగరం జిల్లా లో అనేక మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేయడంతో ఉపాధ్యాయులలో ఆందోళన మొదలైంది.

- Advertisement -

త్వరలోనే రాష్ట్రమంతటా ఇదే తరహాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. సిఎస్‌ఈ నుంచి గైర్హాజరైన వారి డేటా ఉదయం 10 గంటల లోపే డీఈవో/ఎంఈవో కార్యాలయానికి చేరుకొనేలా అనుక్షణం విద్యా శాఖ అధికారులు ప్రణాళికలు రచించారు. స్పెషల్‌ డ్యూటీ అ్లఫ చేస్తే అక్కడ మస్ట్‌ అండ్‌ షుడ్‌ లాగిన్‌ అండ్‌ లాగవుట్‌ వేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇప్పటికే జీతాలకు – బయోమెట్రిక్‌ హాజరుకు లింక్‌ చేసినట్లు, ఎమ్‌ఎల్‌, ఈవోఎల్‌ మొదలైన దీర్ఘకాలిక సెలవులకు జీతాలతో లింక్‌ చేసినట్లు, త్వరలోనే పూర్తి స్థాయిలో జీతాలకు – అటెండెన్స్‌ తో లింక్‌ చేయనున్నట్లు వాట్సప్‌ గ్రూపులలో మేసేజ్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘నో వర్క్‌ – నో పే’ రూల్‌ విధానాన్ని అ్లప్లై చేస్తూ ఎన్ని రోజులకు బయోమెట్రిక్‌ హాజరు వేస్తే అన్ని రోజులకే జీతాలు చెల్లిస్తారని కాబట్టి అందరూ రేపటి నుంచీ చాలా జాగ్రత్తగా బయోమెట్రిక్‌ హాజరు పై జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా లీవ్‌ 9 లోపే ఆన్‌ లైన్‌ లో చేయండి. లాగ్‌ ఇన్‌, లాగ్‌ అవుట్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్‌కాకండి.

వోడి అయితే తప్పకుండా లాగిన్‌, లాగవుట్‌ అయ్యి తీరండి. ఏమాత్రం అలక్ష్యం వద్దు.బయోమెట్రిక్‌ హాజరు పై అనేక మంది ఉపాధ్యాయులకు అందబోతున్న ఛార్జి మెమోలు ఒక చిన్న నిర్లక్ష్యం పెనుప్రమాదానికి దారి తీయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్‌ హాజరు కు టాప్‌ ప్రయారిటీ- ఇవ్వండి అంటూ వాట్సప్‌ గ్రూపుల ద్వారా ఉపాధ్యాయుల మేసేజ్‌లు ఫోన్లలో ఒకరికి ఒకరు షేర్‌ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement