Sunday, May 5, 2024

కంపెనీల అత్యాశే బ్యాటరీల పేలుడుకు కారణం.. బ‌జాజ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వెల్ల‌డి

ఎలక్ట్రికల్‌ వాహనాల్లో బ్యాటరీల పేలుడుకు కంపెనీల అత్యశ, మతిలేని మార్కెట్‌ పోటీనే కారమణమని బజాజ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ అభిప్రాయపడ్డారు. నమ్మకంలేని ఉత్పత్తులు, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పూణేలో కొత్తగా ప్రత్యేకంగా విద్యుత్‌ వాహనాల తయారీ కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ఆయన శుక్రవారం నాడు ప్రారంభించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ఇటీవల విడుదల చేసిన నివేదికలో బ్యాటరీల్లో లోపాల మూలంగానే పేలిపోతున్నాయని స్పష్టం చేసింది. తయారీ ఖర్చు తగ్గించుకునేందుకు ఎలక్ట్రికల్‌ వాహన తయారీ కంపెనీలు ఉద్దేశ్యపూర్వకంగానే తక్కవ నాణ్యత ఉన్న పరికరాలను వినియోగిస్తున్నాయని పేర్కొంది. బ్యాటరీ లోపం వల్ల మండిపోవడం ఒక్కటే సమస్య కాదని ఇంజిన్‌ తయారీలో లోపాల మూలంగానూ ఇది జరుగుతుందని రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు. ఎలక్ట్రికల్‌ వాహనాల ఉత్పత్తి కోసం బజాజ్‌ కంపెనీ ప్రత్యేకంగా చేతక్‌ టెక్నాలజీస్‌ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది.

ఈవీల తయారీలో అనుసరించాల్సిన నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలను అందిపుచ్చుకోవాలని కొన్ని కంపెనీలు హడావుడిగా మార్కెట్‌లోకి వాహనాలను తీసుకు వస్తున్నాయని, ఇదే సమస్యలకు మూలమని అభిప్రాయపడ్డారు. తక్కువ వేగంతో నడిచే విద్యుత్‌ వాహనాల తయారీ, అమ్మకాలపై ఎలాంటి నియంత్రణలేదని, ఇలాంటి వాహనాలు పేలిపోతున్నాయని, వీటికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇందుకు ఎవరో ఒకరిని బాధ్యత వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం మొత్తం ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో ఎలక్ట్రికల్‌ టూ వీలర్‌ వాటా 2 శాతంగా ఉందని, ఇది 2030 నాటికి 80 శాతానికి చేరుకుంటుని చెప్పారు. అదే సమయంలో విద్యుత్‌ వాహనాల్లో మంటలు వచ్చిన సంఘనలు కూడా 9 శాతం పెరిగాయని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement