Sunday, May 19, 2024

ఐపీఎల్‌ ప్రసార వేలానికి అమెజాన్‌, రిలయన్స్‌.. రేసులో ది వాల్ట్‌ డిస్నీ, సోనీ గ్రూప్‌

అమెజాన్‌, ది వాల్ట్‌ డిస్నీ కంపెనీతో పాటు బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లు.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రసార హక్కుల కోసం నిర్వహించే వేలం రేసులో ఉన్నాయి. వీటితో పాటు సోనీ గ్రూప్‌ కార్పొరేషన్‌, జీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, ఫాంటసీ స్పోర్ట్‌ ్స ప్లాట్‌ఫాం డ్రీమ్‌ 11 కూడా బిడ్‌ దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. బిడ్‌కు సంబంధించిన పత్రాలను ఈ సంస్థలు.. బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా (బీసీసీఐ) నుంచి పొందినట్టు సమాచారం. జూన్‌ 12 నుంచి ఐపీఎల్‌ ప్రసారానికి సంబంధించిన వేలం ప్రక్రియన ఆన్‌లైన్‌ వేదికగా ప్రారంభం కానుంది. వేలంలో హక్కులు దక్కించుకున్న సంస్థ.. 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లను లైవ్‌ స్ట్రీమింగ్‌, టీవీ ప్రసారం కోసం ప్రపంచ వ్యాప్తంగా హక్కు పొందుతుంది.

మూడో స్థానంలో ఐపీఎల్‌..

ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసే క్రీడా ఈవెంట్స్‌లో ఐపీఎల్‌ మూడో స్థానంలో ఉంది. దీనికి సంబంధించిన హక్కులు పొందడం కూడా అంత సులభం కాదు. ఐపీఎల్‌ అనేది.. సూపర్‌ బౌల్‌ ఆఫ్‌ క్రికెట్‌గా పరిగణించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వందల మిలియన్‌ల మంది ఐపీఎల్‌ ప్రసారాన్ని వీక్షిస్తుంటారు. ఈ కంపెనీలతో పాటు మరికొన్ని సంస్థలు వేలంలో పాల్గొనేందుకు నిర్ణయించాయి. ఈవెంట్‌ కోసం మీడియా హక్కులు పొందేందుకు 5 బిలియన్‌ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ బిడ్‌ వేసే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ నుంచి దరఖాస్తులు తీసుకున్న ప్రతీ కంపెనీ.. వేలంలో పాల్గొనాలనే రూల్‌ లేదని, కొన్ని కంపెనీలు వేలం రేసు నుంచి తప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. గతేడాది ఐపీఎల్‌ ఎడిషన్‌ 380 మిలియన్‌ల మంది వీక్షకులను పొందింది. అయితే వేలంలో పాల్గొనే విషయంలో మాత్రం రిలయన్స్‌, అమెజాన్‌, సోనీ, జీ, డ్రీమ్‌ 11 స్పందించేందుకు నిరాకరించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement