Tuesday, April 30, 2024

Olympus | చాట్‌జీపీటీకి పోటీగా అమెజాన్ ‘ఒలింపస్’..

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న సంచనాలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ అడుగుపెడుతోంది. అన్ని కంపెనీలు ఈ టెక్నాలజీని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా ఓపెన్‌ఏఐ కంపెనీ రూపొందించిన చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ రాకతో ఈ ట్రెండ్‌ మొదలైంది.

అనంతరం టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన సొంత చాట్‌బాట్‌ బార్డ్‌ ను రిలీజ్‌ చేసింది. ఇప్పుడు ఈ రెండింటికీ పోటీగా యూఎస్‌ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రానుంది. ‘ఒలింపస్’ అనే కోడ్‌నేమ్‌తో లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌(LLM)ని అభివృద్ధి చేస్తోంది. ఒలింపస్ డెవలప్‌మెంట్‌తో అతిపెద్ద AI మోడల్‌లలో ఒకటిగా నిలువనుంది.

ఇది రెండు ట్రిలియన్ పారామీటర్స్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. OpenAIకి చెందిన GPT-4 మోడళ్లు ఒక ట్రిలియన్ పారామీటర్స్‌ని మాత్రమే కలిగి ఉండటం గమనార్హం. ఈ కంపెనీలు మాత్రమే కాకుండా యాపిల్‌ వంటి సంస్థలు కూడా ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement