Sunday, May 19, 2024

జనవరి-జూన్‌ కాలంలో 42.85 శాతం పెరిగిన ఎయిర్‌ ట్రాఫిక్‌

దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023 జనవరి నుంచి జూన్‌ వరకు విమాన ప్రయాణికుల సంఖ్య 42.85 శాతం పెరిగి 760.93 లక్షలుగా నమోదయ్యారు. 2022లో జనవరి నుంచి జూన్‌ వరకు ప్రయాణికుల సంఖ్య 572.49 లక్షలుగా నమోదైందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల పెరుగుదల వార్షికంగా 32.92 శాతంగా, నెలవారి పెరుగుదల 18.78 శాతంగా ఉందని పేర్కొంది.

జనవరి మే కాలంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 636.07 లక్షలగా ఉందని జూన్‌ 15న డీసీజీఏ తెలిపింది. 2022లో ఇదే కాలం లో ప్రయాణికుల సంఖ్య 467.37 లక్షలుగా ఉంది. మే నెలలో దేశీయంగా 132.14 లక్షల మంది విమాన ప్రయాణికులు నమోదయ్యారు. మేలో విమాన సర్వీస్‌ల రద్దు శాతం 0.44శాతంగా ఉందని డీజీసీఏ తెలిపింది. మే నెలలో వివిధ రకాల ఫిర్యాదులు మొత్తం 556 వచ్చినట్లు తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement