Sunday, May 5, 2024

Delhi | సీతమ్మ సాగర్ పనులపై ఎన్జీటీ ఆగ్రహం.. తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పర్యావరణ అనుమతులు లేకపోయినా సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపేయాలంటూ గతంలోనే ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందంటూ పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

పనులు కొనసాగిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందంటూ ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పనులు కొనసాగిస్తుంటే చర్యలెందుకు చేపట్టలేదంటూ గోదావరి రివర్ బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖలపైన కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వంపై చేపట్టిన చర్యలపై నివేదిక ఈ రెండు విభాగాలను ఎన్జీటి ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement