Sunday, May 5, 2024

జులై 3వరకు ఫ్లాట్‌ 50శాతం తగ్గింపు.. ప్రకటించిన నెక్సస్‌ హైదరాబాద్‌

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : హైదరాబాద్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన షాపింగ్‌ కేంద్రం నెక్సస్‌ హైదరాబాద్‌ అత్యంత ఆసక్తిగా నగరవాసులు ఎదురుచూస్తోన్న ఫ్లాట్‌ 50శాతం తగ్గింపును జూలై 1,2,3 తేదీల్లో అందిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో అతిపెద్ద రిటైల్‌ ఫ్లాట్‌ఫామ్‌ నెక్సస్‌ మాల్స్‌ భారతదేశ వ్యాప్తంగా 13 నగరాల్లో 17 మాల్స్‌ను కలిగి ఉంది. కరోనా మహమ్మారి అనంతర కాలంలో వ్యాపారం తిరిగి సాధారణతకు వచ్చింది. షాపర్లు మరింతగా అన్వేషించాలనుకుంటున్నారు. నెక్సస్‌ మాల్స్‌ వద్ద సందర్శకుల సంఖ్య కోవిడ్‌ ముందు నాటికి చేరింది. ఇది దృష్టిలో పెట్టుకుని షాపర్లను మరింతగా ఆకర్షించేందుకు ఫ్లాట్‌ 50శాతం రాయితీ అందిస్తున్నారు.

ఈ అమ్మకాలు జూలై 1 నుంచి జూలై 3వ తేదీ వరకూ జరుగుతాయి. ఈ మూడు రోజుల షాపింగ్‌లో వినియోగదారులు అత్యంత ఆకర్షణీయమైన బహుమతులు సైతం గెలుచుకోవచ్చు. అప్పెరల్‌ మొదలు ఫుట్‌వేర్‌, లైఫ్‌్టసల్‌ బ్రాండ్స్‌ వరకూ అన్ని బ్రాండ్లూ ఇక్కడ తమ రాయితీలను అందిస్తున్నాయి. ఈ 50 శాతం రాయితీ అందిస్తున్న కొన్ని బ్రాండ్లలో జరా, జాక్‌ అండ్‌ జోన్స్‌, పాంటాలూన్స్‌, మ్యాక్స్‌, ద బాడీ షాప్‌, హోమ్‌ సెంటర్‌ మొదలైనవి ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement