Tuesday, May 7, 2024

Maruti Suzuki లాభంలో 33 శాతం వృద్ధి

దేశీయ అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలను బుధవారం నాడు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన 3వ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన 3,207 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్ర కటించింది. గత సంవత్సరం ఆదే త్రైమాసికంలో నమోదైన 2,406 కోట్లతో పోల్చితే ఇది 33 శాతం అధికం. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం 29,251 కోట్ల నుంచి 15 శాతం పెరిగి 33,513 కోట్లకు చేరింది.

మారుతీ సుజుకీ ఈ ఆర్ధిక సంవత్సరం 9 నెలల కాలంలో రికార్డు అమ్మకాలు జరిపింది. ఈ అమ్మకాల ద్వారా నికర లాభం పెరిగింది. మొత్తం ఈ కాలంలో కంపెనీ 15,51,292 యూనిట్లను విక్రయించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 5,01,207యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 4,65,911 యూనిట్లను విక్రయించింది. దేశీయ విక్రయాలు 4,03,929 నుంచి 4,29,422 యూనిట్లకు చేరాయి. ఏ త్రైమాసికంలో లేనంతగా 71,785 కార్లను కంపెనీ ఎగుమతి చేసింది. కంపెనీ 9 నెలల కాలంలో దేశీయంగా 13,46,965 యూనిట్లను విక్రయించగా, 2,04,327 యూనిట్లను ఎగుమతి చేసింది. ఈ 9 నెలల కాలంలో కంపెనీ 1,06,297 కోట్ల రుపాయల ఆదాయం నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement