Monday, May 6, 2024

నంద్యాల కలెక్టరేట్ ఎదుట యువకుడి ఆత్మహత్యయత్నం

నంద్యాల కలెక్టరెట్ ఎదుట ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. కార్యాలయం ఎదురుగా నడిరోడ్డుపై పెట్రోల్ క్యాన్ ఉంచుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. తనది డోన్ ప్రాంతమని.. ఆర్థిక మంత్రి బుగ్గన అనుచరులు తన పొలంలో అన్యాయంగా రహదారి ఏర్పాటు చేస్తున్నారని వాపోయాడు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మహత్య యత్నం చేసిన యువకుడి పేరు రవికుమార్. ఈయనది బేతంచెర్ల మండలం కే. కొట్టాల గ్రామముకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
తనకు వారసత్వంగా వచ్చిన భూమిని అన్యా అక్రాంతం చేయడం పై బేతంచెర్ల మండల రెవెన్యూ అధికారులకు ఎన్నిమార్లు విన్నవించ్చిన సదరు అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకురావడానికి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించినట్లు పోలీసు విచారణలో యువకుడు తెలిపాడు. యువకుడిని అదుపులోకి తీసుకున్న మూడవ పట్టణ పోలీసులు అతని పై ఆత్మహత్య ప్రయత్నం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement