Friday, May 3, 2024

మై డియరెస్ట్ ఫ్యాన్స్.. BoyapatiRapoలో ఇంకా చాలా ఉంది.. హీరో రామ్

హీరో రామ్ ఓ ట్వీట్ చేశాడు..మై డియరెస్ట్ ఫ్యాన్స్.. BoyapatiRapoలో ఇంక చాలా ఉందని తెలిపాడు. కాగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న BoyapatiRapoలో నటిస్తున్నారు హీరో రామ్. ఊరమాస్ లుక్ లో రామ్ పోతినేని దుమ్ములేపుతున్నారు. ‘బోయపాటి రాపో’ నుంంచి పవర్ ఫుల్ గ్లింప్స్ వదిలారు. BoyapatiRapo First Thunderగా వచ్చిన గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. రామ్ పోతినేని మాస్ అవతార్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం యూట్యూబ్ లో గ్లింప్స్ #1 ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. రామ్ పోతినేని ఫ్యాన్స్ తో పాటు ఇతర స్టార్స్ అభిమానులు కూడా ఫస్ట్ థండర్ అదిరిపోయిందంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా రామ్ పోతినేని కూడా ఫస్ట్ థండర్ కు వచ్చిన రెస్పాన్స్ పై, అలాగే తనకు బర్త్ డే విషెస్ తెలిపిన వారికి థ్యాంక్స్ చెబుతూ స్పందించారు. ట్వీట్ చేస్తూ.. నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ఇండస్ట్రీలోని నా తోటీ నటీనటులు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక నా డియరెస్ట్ ఫ్యాన్స్.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నిజంగా ఎప్పటిలాగే మీ ఆశీర్వాదం కావాలి. ప్రతి ఒక్కరూ #BoyapatiRAPO గ్లింప్స్‌ని ఎంతగానో ఆస్వాదిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement