Thursday, May 16, 2024

Crime: వెంకటగిరిలో దారుణం.. యువతి గొంతు కోసిన యువకుడు

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఘోరం జరిగింది. కాలేజీమిట్టలో చెంచు కృష్ణ అనే యువకుడు ఇంటర్ విద్యార్థి జ్యోతి (18) గొంతు కోశాడు. ప్రేమించడం లేదనే కోపంతో..కాలేజికి వచ్చిన అమ్మాయిపై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement