Wednesday, May 8, 2024

Flash Flash.. రేణిగుంటలో దారుణ హత్య.. భర్త తల నరికేసిన భార్య

చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలోని బుగ్గ వీధిలో దారుణం జరిగింది. భార్య,భర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్త రవిచందర్(53) తలను భార్య వసుంధర కత్తితో నరికి అతి దారుణంగా హత్య చేసింది. భర్త తల తీసుకొని వీధుల్లో నడుస్తూ రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో భార్య వసుంధర లొంగిపోయింది. భార్య భర్తల మధ్య వివాదాల కారణంగానే హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట అర్బన్ సీఐ అంజు యాదవ్ హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement