Wednesday, April 24, 2024

ఇండోనేషియా రాజధాని మార్పు..

ఇండోనేషియాకు కొత్త రాజధాని నగరంగా కాళీమంటన్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత రాజధాని నగరం జకార్తాకు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం పొంచి ఉండటంతో ఆ దేశ ప్రతినిధుల సభ (పార్లమెంటు) రాజధాని మార్పునకు ఆమోదం తెలిపింది. బోర్నియో ద్వీపానికి తూర్పున అటవీ ప్రాంతంలో ఈ ప్రదేశం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో జకార్తా నగరం వేగంగా మునిగిపోతోందనే భయాందోళనలు వ్యక్తమవుతుం డటంతో కొత్త రాజ ధాని నగరం అవసరమైంది. ఇండోనేషియా నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ శాఖ మంత్రి సుహార్సో మోనోఅర్ఫా ఆ దేశ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ, అనేక అంశాలను పరిశీలించి, ప్రాంతీయ సానుకూలతలను, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కాళీమంటన్‌ను నూతన రాజధాని నగరంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ద్వీపాల మధ్యలో నూతన ఆర్థిక కేంద్రం ఆవిర్భవించాలనే దూరదృష్టి తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇండోనేషియా ఆర్థిక మంత్రి ముల్యానీ మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఐదు దశల్లో నూతన రాజధాని నగర నిర్మాణం జరుగుతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement