Tuesday, May 14, 2024

గృహ నిర్మాణంపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి : అచ్చెన్నాయుడు

పేదలు ఇళ్లు కట్టుకోలేని విధంగా ఇసుక, సిమెంట్ ధరలు విపరీతంగా పెంచారని, ధైర్యం ఉంటే గృహనిర్మాణం పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…. సెంటు భూమి పథకంలో వైసీపీ ఎమ్మెల్యేలు రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. అనేక చోట్ల నివాసయోగ్యం కాని చోట సెంటు పట్టాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్నారని మాట్లాడిన వారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

పేదలకు దక్కాల్సిన ఇళ్లను కూడా వైసీపీ నేతలు అవినీతికి ఆదాయ వనరుగా మార్చుకున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3.16లక్షల ఇళ్ళు కట్టి 2.62లక్షలు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచిందని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఇచ్చి పేదలకు ఏటా 5లక్షల ఇళ్లు కడతానని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, గత 3 ఏళ్లలో 15లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉండగా జగన్ కేవలం 5 ఇళ్లు మాత్రమే నిర్మించారని విమర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement