Monday, April 29, 2024

నేడు 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం

ఏపీవ్యాప్తంగా నేడు రాష్ట్ర, జిల్లా,బూత్ స్థాయిల్లో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉ.11.30గం.లకు అమరావతి సచివాలయం 5వ బ్లాకు కలక్టర్ల సమావేశ మందిరంలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ముందుగా జాతీయ గీతాలాపనతో ఈకార్యక్రమం ప్రారంభం కానుండగా 11.35గం.లకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సిఇఓ)కె.విజయానంద్ స్వాగతోపన్యాసం చేయనున్నారు. 11.40గం.లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆన్లైన్(వెబ్ నార్) ద్వారా పాల్గొని జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రాముఖ్యత గురించి ప్రసంగించనున్నారు.

అదే విధంగా ఉ.11.50గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ నుండి ఆన్లైన్ వెబ్ నార్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరితో ప్రతిజ్ణ చేయించిన తదుపరి 12వ జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రాముఖ్యతను గురించి ప్రసంగిస్తారు.తదుపరి మధ్యాహ్నం 12.10గం.లకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ రాష్ట్ర స్థాయిలో జాతీయ ఓటర్ల దినోత్సవ విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులను అందిస్తారు.అనంతరం మధ్యాహ్నం 12.40గం.లకు డిప్యూటీ సిఇఓ ఎ.వెంకటేశ్వరరావు కార్యక్రమానికి వందన సమర్పణ గావించగా తదుపరి జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement