Friday, December 6, 2024

AP: అప్ప‌న్న చంద‌నోత్స‌వానికి భారీ విరాళం..

లక్ష విరాళం అందించిన ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుడు
దాత‌ల స‌హ‌కారంతోనే మ‌హోత్స‌వాలు: ఈవో శ్రీ‌నివాస్‌

ఆంధ్ర‌ప్ర‌భ‌, సింహాచలం: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం వరహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో మే 10న అప్పన్న నిజరూప దర్శనం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చందన సమర్పణకు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు శనివారం ఆలయ ఈవో సింగం శ్రీనివాస్ మూర్తిని కలిసి లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. దాతల సహకారంతోనే దేవాలయాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయన్నారు. ఇటీవలే సింహగిరిపై చేపట్టిన నారసింహ మహో యజ్ఞం పూర్తి స్థాయిలో విజయవంతం కావడానికి దాతల సహకారం ఎంతో ఉందన్నారు. చందన సమర్పణకు తొలి విరాళం అంద‌డం అభినందనీయం అన్నారు.

- Advertisement -

గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. ఏటా చందన సమర్పణకు తాము లక్ష చొప్పున విరాళంగా అందజేస్తామన్నారు. గతంలో దేవస్థానం అమలు చేసిన స్వర్ణ తులసీ దళాలు, స్వర్ణ పుష్పార్చన పథకాలకు బంగారం కొనుగోలుకు విరాళం అందజేసినట్టు తెలిపారు. అన్నప్రసాదానికి గతంలో మూడు లక్షలు విరాళం, కవచం కోసం 27 కిలోల ఇత్తడి, వివిధ సామ‌గ్రి ఇచ్చామ‌న్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు టీపీ రాజ గోపాల్, ఏఈవో ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement