Friday, May 3, 2024

Sarangadaria : మధ్యతరగతి..సంఘర్షణలు..

సీనియర్‌ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సారంగదరియా’. ఉమాదేవి, శరత్‌ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఎం. ఎబెనెజర్‌ పాల్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి చిత్రబృందం ”అందుకోవా…” అనే లిరికల్‌ పాటని విడుదల చేశారు. హీరో నవీన్‌ చంద్ర చేతుల మీదుగా పాట విడుదలైంది.

- Advertisement -

”అందుకోవా.. ” అనే లిరికల్‌ సాంగ్‌ విషయానికి వస్తే.. పాటను చిత్ర ఆలపించారు. ఇదొక ప్రేరణ కలిగించే గీతమని, ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ చాలా ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పేలా, స్ఫూర్తిని నింపేలా పాట ఉంది. రాంబాబు గోశాల పాటను రాశారు.
చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్‌ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని చెప్పారు. చిత్ర దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి (పండు )మాట్లాడుతూ ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటు-ంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, లవ్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఇలా అన్ని ఉంటాయి. అన్నారు. ఈ చిత్రంలో రాజా రవీంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శివ చందు, యశస్విని, మొయిన్‌ ,మోహిత్‌, నీల ప్రియా, కాదంబరి కిరణ్‌, మాణిక్‌ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ, హర్షవర్ధన్‌, తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement